బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గారాల కూతురు ఐరా ఖాన్ సోషల్ మెడియలో ఎప్పుడు ఆక్టివ్ గానే ఉంటారు. ఏ విషయం అయిన ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. తన పర్శనల్ విషయాలు ఏవైనా బహిరంగంగానే అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె గత కొన్ని సంవత్సరాలు గా తన ఫ్యామిలీ ఫిట్నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరే తో ప్రేమలో ఉన్న సంగతిని ఆమె ఎన్నో సందర్భలో బయట పెట్టింది.
అప్పట్లో తన మాజీ బోయ్ ఫ్రెండ్ మీశాల్ కిర్పాలనీ తో డేటింగ్ కూడా చేసింది. ఆ సమయంలో వీరు దిగిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇప్పుడు నూపుర్ శిఖరే తో ఆమె పీకల్లోతో ప్రేమలో ఉంది. తన ప్రేమను ఈ వేలంటైన్స్ డే సందర్భంగా ఆమె తన ఇంస్టా లో ఈ విధంగా పోస్ట్ చేసింది. మీకు ఈ విషయాని తెలియజేయడం గౌరవంగా ఉంది అని తన ప్రేమను అధికారికంగా ప్రకటించింది.
అయితే ఆ ఫోటోకు #హాయ్, #వాలేయుబీమైన్, #మైవేలంటైన్ #బడ్డి #యువర్ బెట్టర్ అతచిస్ లైన్స్ #డ్రింబోయ్ అంటూ ట్యాగ్ చేసి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇంస్టా లోని ఆమె అభిమానులు అల్ ది బెస్ట్, కంగ్రాట్స్ అంటూ విశ్ చేస్తున్నారు. నూపుర్ శిఖరే, అమీర్ ఖాన్ తో పాటుగా పలు బాలీవుడ్ ప్రముఖులకు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేశాడు. ఆ సమయంలో ఐరా ఖాన్ కు పర్సనల్ జిమ్ ట్రైనర్ గా పనిచేశాడు ఆ సమయంలో అతనితో ఆమె ప్రేమలో పడింది.
ఈ విషయంపై అమీర్ ఖాన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వీరి ప్రేమను అంగీకరిస్తాడా లేదా అనే విషయం తెలియాలిసి ఉంది. ఐరా ఖాన్ అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్ ల కూతురు.