ఓవియా హేలెన్ ఇమె మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాలోకి అడుగు పెట్టింది. కానీ సరైన నటిగా మాత్రం గుర్తింపు రాలేదు. తెలుగు, తమిళ కన్నడ, మలయాళ, హింది చిత్రాలో హీరోయిన్ గా నటించింది.టాలీవుడ్ లో మాత్రం హీరో తరుణ్ తో ఇది నా లవ్ స్టోరీ అనే చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం నిరాశ పరచడంతో తెలుగు దర్శక నిర్మాతలు ఆమె మొఖం కూడా చూడలేదు.
సినిమాల్లో గుర్తింపు రాకున్న వివాదాల ద్వారానే పేరును తెచ్చుకుంది. తమిళ బిగ్ బాస్ పాల్గొన్న ఆమె బయటకు వచ్చిన తర్వాత సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను టిఆర్పి రేటింగ్ కోసం ఆ షో యజమాన్యం నానా చిత్ర హింసలకు గురిచేస్తారు అని సంచలన ఆరోపణలు చేసింది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఓవియా హేలెన్ బాగా ఆక్టివ్ గా ఉంటారు. ఇమెకు ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే ఉంది.
నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు ఆమె రిప్లే కూడా ఇస్తూ ఉంటుంది. ప్రేమ పై తనకు నమ్మకం లేదని నేను ఎప్పుడు ఎవరిని ప్రేమించలేదు అని చెప్పిన హేలెన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తన ప్రియుడు తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. వారు చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలపై కొంతమంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం లైక్ లు, కామెంట్స్ షెర్స్ తో బాగా వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలపై ఓవియా హేలెన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.