బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా “ది హీరో” చిత్రంతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్టు చిత్రాల్లోనూ నటించింది. గ్లామర్ పరంగా చూసుకుంటే చూపు తిప్పుకొని అందం ఆమె సొంతం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగ ఆమెకు అభిమానులు ఉన్నారు. హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె రానిస్తుంది. మొదట అక్కడ సిరియల్స్ లోనటించిన ఆమెకు హాలీవుడ్ నటుడు రాక్ నటించిన చిత్రంలో నెగటివ్ రోల్ నటించి అందరినీ ఆకర్షించింది.
ఆ తర్వాత అమెరికన్ సింగర్ నిజ్ జాన్స్ ను పెళ్లి చేసుకుంది. ఇతను ఆమె కంటే వయసులో చిన్నవాడు. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య మరి ఎక్కువగా ఉంటుంది. ఆమె నటించిన సినిమాలను ప్రమోట్ చేస్తుంది. ఆమె హాట్ హాట్ ఫోటోలు ఇంస్టా లో నిత్యం షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె కేన్స్ ఫిల్మ్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై నడిచిన ఫోటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని విషయాలను రాసుకొచ్చింది.
కేన్స్ లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కలిగిన మెరిసే డ్రస్ ధరించిన ఆమె బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం టెన్షన్ గా నర్వస్ గా ఫీల్ అయ్యారంట. అందుకు కారణం ఆమె వేసుకున్న జిప్ ఫెయిల్ అయిందని ఆమె చెప్పింది. అసమయంలో నాకు ఏమి చెయ్యాలో తెలియలేదు. వెంటనే మా టీమ్ ఆ డ్రెస్స్ ను కుట్టి ఇచ్చింది. అప్పుడు కాస్త రిలాక్స్ గా అనిపించి వెంటనే చిరునవ్వుతో రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వెళ్ళిన అని అంది. ఈ సందర్భంగా ఆమె కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.