బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ ను తమిళంలో అజిత్ హీరోగా బోనీ కపూర్ రీమేక్ చేశాడు. తెలుగులో ఈ సినిమా రీమేక్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకుని పలువురు హీరోలను సంప్రదించాడు. బాలయ్య ఈ రీమేక్ లో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని చివరకు ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించారు. పెద్ద ఎత్తున ఈ సినిమాలో మార్పులు చేయకుండా కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి రీమేక్ చేయడం జరిగింది. వకీల్ సాబ్ సినిమా ను అభిమానులు తెగ ఎంజాయ్ చేసే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా పవన్ ఈ రీమేక్ ను చేస్తున్నాడు అంటే చాలా మంది నమ్మలేదు. ఇలాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ నాన్ కమర్షియల్ సినిమాను పవన్ ఎలా ఒప్పుకున్నాడంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. బాలయ్య నో చెప్పిన సబ్జెక్ట్ కు ఎలా పవన్ ఓకే చెప్పాడని కూడా కొందరు అనుకున్నారు. కాని పవన్ కు ఈ కథ కు కమర్షియల్ టచ్ జోడించకున్నా చేయాలనిపించిందట. ఎందుకంటే మహిళల నేపథ్యం లో ఈ సినిమా ను రూపొందించడమే కారణం.
బాలయ్య ఒక వేళ వకీల్ సాబ్ తో చేస్తే ఫలితం ఎలా ఉండేది అంటూ కొందరు ఇప్పుడు ఆలోచిస్తూ ఫన్నీ ఫన్నీగా ఆలోచిస్తున్నారు. బాలయ్య కోసం కథ మార్చాల్చి వచ్చేది. ఫైటింగ్ సీన్స్ లో రైల్లు తొడ కొట్టడాలు జరిగేవి. కోర్టు సీన్ లో బాలయ్య తొడ కొట్టిన వెంటనే జడ్జ్ సైలెంట్ అయ్యే వాడు అంటూ మీమ్స్ వస్తున్నాయి. మొత్తానికి బాలయ్య వకీల్ సాబ్ గా కనిపించక పోవడమే మంచిది అయ్యిందని కొందరు అంటున్నారు.