ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్నా హీరోహీరోయినలుగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో వసూల్లు రాబట్టిన ఈ సినిమా బాలీవుడ్ లోనూ వంద కోట్ల రూపాయవను రాబట్టింది. ఇక తమిళ, కన్నడ భాషల్లో కూడా కోట్లలోనే వసూళ్లను రాబట్టింది. అయితే ఇదిలా ఉండగా… హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమా టీంను కలిశారు. ఎందుకు కలిశారు, ప్రస్తుతం ఏం చేయబోతున్నారు అనే దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే వచ్చే నెల నుంచే పుష్ప-2 సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారనంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ పుష్ప సినిమా టీం సభ్యులను కలవడంతో… ఇది నిజమేనని చాలా మందే భావిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారట. అంతే కాదు 4 నుంచి ఆరు నెలల్లోనే షూటింగ్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారట. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారట.
అయితే పుష్ప సినిమా బృందంతో మీటింగ్ పెట్టిన అల్లు అర్జున్ ఈ విషయాల గురించే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే నాలుగు నుంచి ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి అంశంపై సాధ్యాసాధ్యాల గురించి డైరెక్టర్ సుకుమార్ తో బన్నీ మాట్లాడరట. ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇదే ఏడాదిలో సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారట.
అంతే కాదండోయ్ బాలీవుడ్ లోనూ భారీ ప్రమోషన్స్ చేసుకునే అవకాశం ఉండాలి. అందరూ కూడా ఆ దిశగానా ముందుకెళ్లాలని బన్నీ వివరించారట. అయితే ఇక పుష్ప 2 సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమని తెలుస్తోంది.