సుకుమార్ శిష్యుడు, బుచ్చి బాబు సన ప్రస్తుతం ఉప్పెన చిత్రంను రూపొందించాడు. మెగా హీరో వరుణ్ తేజ్, కృతి శెట్టి లు హీరో హీరోయిన్ లుగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ యర్నేని, శంకర్, సుకుమార్ లు నిర్మించారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమ కథ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు.
ప్రస్తుతం ఉప్పెన టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉంది. సినిమా మొదలు పెట్టినప్పటి నుండి కూడా ఈ చిత్రానికి బాగా ప్రమోట్ చేశారు. ఇంతవరకు టాలీవుడ్ లో ఏ చిత్రానికి కూడా ఏ రేంజ్ లో ప్రమోషన్ జరగలేదు. లాక్ డౌన్ సమయంలోనూ ఉప్పెన పేరు మారుమోగిపోయింది. తాజాగా ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన ఓ ఇంటర్వ్యూ లో మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సుకుమార్ గారు మహేష్ బాబు తో నేనొక్కడినే సినిమా చేస్తున్న సమయంలో నేను ఆ చిత్రానికి అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేస్తున్నాను. అప్పుడు మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో సితారా చాలా చిన్న పాప.. నేను ఆ పాపను చూసి ఈ చాలా ముద్దుగా చాలా క్యూట్ గా ఉంది అని అన్నాను. వెంటనే నమ్రత సితారా పాపను తీసుకువచ్చి నా చేతిలో పెట్టారు.
మనం బయట తిరిగి ఉంటాం.. చేతులు డస్ట్ గా ఉంటాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా వారు నన్ను తన ఇంటిలో మనిషి లాగా నాపై చూపిన అప్యాత నాకు బాగా నచ్చింది. ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయి కనుకే మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు. ఆ చిత్రం యొక్క షూటింగ్ టైమ్ లో గౌతమ్ నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు.
నాతో కలిసి ఆడుకునే వాడు. మహేష్ ఫ్యామిలీ తో నాకు మంచి అనుబందం ఉందని బుచ్చి బాబు సన గుర్తుచేశాడు. ఇక ఉప్పెన చిత్రం విషయానికి వస్తే ప్రేమికుల రోజున అంటే ఫిబ్రవరి 14 న విడుదల అవ్వుతుంది.