హీరో శ్రీరామ్ గురించి తెలుగు, తమిళ ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజా పూలు, ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, దడ, నిప్పు, లై వంటి చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన… తెలుగులోకంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. అయితే ఎక్కువగా ఆయన తమిళ సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఆయన తెలుగు వాడనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఇటీవలే ఆయన ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. అయితే అందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు హీరో శ్రీరామ్.
మీరు ఇంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతున్నారేంటి అని అలీ ప్రశ్నించగా.. నాన్న గారు తెలుగు కుటుంబానికి చెందినవారు, అమ్మ తమిళ్… అందుకే నాకు తెలుగు అంత బాగా వచ్చు అని చెప్పారు. అయితే నాన్ని ఫోన్ చేస్తే తెలుగులో.. అమ్మ ఫోన్ చేస్తే తమిళలం మాట్లాడతానని వివరించారు. అలాగే మీకు పెళ్లయిందా అని అలీ ప్రశ్నించగా… హా తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకున్నానంటూ శ్రీరామ్ తెలిపాడు. అంతే కాదండోయ్.. ఆ అమ్మాయి తను కూర్చొమ్మంటే కూర్చుంటుందని.. నిల్చొమ్మంటే నిల్చుంటుందని నవ్వుతూ చెప్పాడు.
అయితే యాక్టర్ వి కాకపోయుంటే ఏమయ్యేవాడివని అలీ ప్రశ్నించగా… కచ్చితంగా అంబానీ అయ్యుండే వాడినని తెలిపాడు. చిన్నప్పుడ వాళ్ల నాన్న సైకిల్ కొనిస్తే… ఖాళీగా ఉంచడం ఎందుకని గంటకు ఐదు రూపాయల చొప్పున రెంట్ కి ఇచ్చేవాడినని చెప్పాడు. చిన్ననాటి నుంచే తనది బిజినెస్ మైండ్ అని.. కానీ అనుకోకుండా సినీ రంగంలోకి వచ్చినట్లు వివరించారు హీరో శ్రీరామ్.