
ఓ పెద్ద సినిమాతో పాటే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయంటే.. ఆ లెక్క ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. థియేట్రికల్ రిలీజ్ సమయంలో సినిమాలు క్లాష్ అవుతూనే ఉంటాయి. అయితే చిన్న సినిమా చిత్ర బృందాలతో పాటు అభిమానులు కూడా తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే రిలీజ్ అయితే మాత్రం ఆ టెన్షన్ వేరే లెవల్లో ఉంటుంది. అటు చితృ బృందాలతో పాటు అభిమానుల్లోనూ తెగ హడావుుడి ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి సంఘటనే చోటుచేసుకోబోతోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాపై ఇప్పటికే.. భారీ అంచనాలున్నాయి. పవర్ స్టార్ అభిమానులతో పాటు చాలా మంది ఈ సినిమాకు తెగ వేచి చూస్తున్నారు. అయితే రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ లతో రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు ఒక్క రోజు ముందే మరో టాప్ హీరో సినిమా రిలీజ్ కాబోతోంది.

ఫిబ్రవరి 24న తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన త్రిభాషా చిత్రం వలిమై రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను తెగ అలరిస్తోంది. అయితే భీమ్లా నాయక్ సినిమా డేట్ ఫిక్స్ అయిందని తెలిసి ఈ చిత్ర బృందం షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. యువ హీరో వలిమై సినిమాలో విలన్ గా నటించిన కార్తికేయ ఈ సినిమా రిలీజ్ పై స్పందించారు. భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ రాగానే షాకయ్యాను. కానీ ఒక్కరోజు ముందు వలిమై వస్తోంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ గా మా సినిమా చూడొచ్చు అంటూ షాకింగ్ కామెంట్సే చశాడు. అయితే కార్తికేయ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.