దేశముదురు చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన హన్సిక..మొదటి చిత్రంతోనే మెగా హిట్ అందుకొని యూత్ కు దగ్గరైంది. మొదటి హిట్ గట్టిగానే పడినప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తో తెలుగు లో పెద్దగా ఛాన్సులు రాలేకపోయాయి. ఆ తర్వాత తమిళనాట అడుగుపెట్టి అక్కడ వరుస విజయాలతో అతి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ..సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తుంది.
తాజాగా ఈ భామ కుటుంబంతో కలిసి వరల్డ్ ఫేమస్ టూరిజం డెస్టినేషన్ స్పాట్ మాల్దీవులు టూర్ వేసింది. ప్రెట్టీ రాప్ స్కర్ట్ అండ్ క్రాప్ ను వేసుకున్న హన్సికా..మాల్దీవుల్లోని రిసార్ట్స్ ల్లో చక్కర్లు కొట్టింది. మత్సకన్యలు నిజమైనవి..శాస్త్రవేత్తలు మిమ్మల్ని ఫూల్స్ చేయడం లేదు..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆరెంజ్ కఫ్తాన్, జ్యువెల్లరీ కాంబినేషన్ కాస్ట్యూమ్స్ లో ఉన్న హన్సికా పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.