వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ లు ఇద్దరు ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఉన్న పాత్రలలోనే నటిస్తున్నారు. కానీ రెండు పాత్రలకు చాలా తేడా ఉంది. నేపథ్యం ఒక్కటే కానీ కథ వేరు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ గని అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క టైటిల్ ను మరియు వరుణ్ లుక్ ను ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రా బృందం విడుదల చేసింది. ఈ చిత్రం యొక్క కథాంశం విషయానికి వస్తే ప్రపంచంలోని ఎంతో మంది క్రీడాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదు.
దేశం కోసం ఓలంపిక్ పథకాలను సాదించినవారి పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది వాటిని హైలెట్ గా చేసుకొని ఈ గని చిత్రంలో చూపించబోతున్న అంటూ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టిన పూరీ జగన్నాథ్ తన తదుపరి సినిమాను విజయ్ దేవరకొండ తో తీస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఎక్కువ భాగం ముంబయి లోనే చిత్రీకరించాడు. కావున పాన్ ఇండియా చిత్రంగా ఈ చిత్రంను విడుదల చెయ్యనున్నాడు. మొదట ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ దర్శకుడు లైగర్ తో విజయ్ దేవరకొండ లుక్ ను విడుదల చేశాడు.
ఈ చిత్రం కూడా బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. కానీ రివెంజ్ డ్రామా అంటూ ప్రచారం కొనసాగుతుంది. పూరీ జగన్నాథ్ తన మార్క్ ను చూపించే విదంగా మాస్ డైలాగ్స్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ను లైగర్ లో చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. 120 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. లైగర్, గని రెండు బాక్సింగ్ నేపథ్యం ఉన్న సినిమాలే కానీ వాటి యొక్క స్టోరీ లైన్ మాత్రం డిఫ్ఫరెంట్. అసలు విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు అగాలిసిందే. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రం విజయం సాదిస్తుందో చూడాలి. లైగర్ బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఛార్మి నిర్మిస్తుంది.