బండ్ల గణేష్..ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు లేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ కెరియర్ మొదలుపెట్టిన ఈయన..అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీ లో పేరు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా రాజకీయాల్లోనూ అడుగుపెట్టి వైరల్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరి, బ్లేడ్ సవాళ్లు విసిరి, ఆ తరువాత ‘ఎన్నో అంటుంటాం. అన్నీ చేస్తామా? ఏమిటి?’ అంటూ మాట మార్చి అభాసులయ్యాడు. కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఈయన సడెన్ గా భాజపాలో చేరుతున్నా అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు.
ఈ వార్త వైరల్ గా మారిందో లేదో..తెల్లవారే సరికి మళ్లీ పాత పాట మొదలుపెట్టాడు. తనకు రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేదంటూ చెప్పుకొచ్చాడు. అదేంటా? అని విచారిస్తే, ఇంటి సభ్యులు ఎవ్వరూ అంగీకరించడం లేదట. ‘మనకి రాజకీయాలు ఎందుకు?వ్యాపారాలు చేసుకోక, కావాలంటే సినిమాలు చేసుకోక’ అంటూ వత్తిడి చేయడం తో పాటు హితులు, సన్నిహితులు కూడా అదే చెప్పడంతో మళ్లీ మరోసారి మాట మార్చకతప్పలేదు బండ్ల.