సుడిగాలి సుధీర్ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. తనదైన స్టైల్ లో అభిమానులను అలరిస్తూ… ఎంతగానో ఎదిగాడు. ఎన్నో కష్టాలు అనుభవించి చివరకు తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. మంచి కమెడియన్ గానే కాకుండా, డ్యాన్సర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే జబర్దస్త్ షో అప్పటి నుంచి ఇఫ్పటి వరకు యాంకర్ రష్మితో లవ్ ట్రాక్ నడుపుతూ.. అదరగొడుతూనే ఉన్నాడు.
అయితే తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఆమెతో ఆ ట్రాక్ అలాగే నడుస్తోంది. ఆమె ఒక్కతే కాకుండా ఆ తర్వాత యాంకర్ విష్ణు ప్రియతో కూడా పెళ్లి చేసుకున్నట్లు ఓ షోలో నటించాడు. అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సుధీర్.. ఇలా తన పెళ్లి అంటూ షోలు చేయడం వాటి ద్వారా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెంచి రేటింగ్స్ పెంచుకోవడం పలు ప్రోగ్రామ్స్ నిర్వాహకులు చేస్తూ వస్తున్నారు. అన్నీ ఆయా షోల రేటింగ్స్ పెంచడం కోసం వేసిన వేషాలే. సుధీర్ ఓ ఆర్టిస్ట్ గా ఇలాంటివి చేయడంలో తప్పు లేదు కానీ.. అందుకు ఓ లిమిట్ అంటూ ఉండాలి కదా అని ఫ్యాన్స్ అంటున్నారు. నిజానికి.. సుధీర్ పెళ్లి విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ వస్తుందేమో అని సుధీర్ అభిమానులు ఎంతో కాలంగా వేయిట్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న తేజస్వీ ఇలాంటివి చేసింది అంటే.. ఒక అర్థం ఉంది. కానీ.. ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న సుధీర్ ఇలాంటి ఫేక్ వీడియోస్ నటిస్తూ.. తన అభిమానుల మనోభావాలను దెబ్బతీయడం ఎందుకు అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒకవేళ వీరిద్దరి బంధం నిజమైనప్పటికీ.. ఇలా ఒక షోలో ఆమెను పరిచయం చేయాల్సిన అవసరం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.