రవితేజ క్రాక్ చిత్రంతో హిట్టు కొట్టి మంచి స్పీడ్ మీద ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఆయన నటిస్తున్న సినిమాలో అయిదుగురు విలన్స్, నలుగురు ఫైట్ మాస్టర్ లు రంగంలోకి దిగుతున్నారు. తమిళ రాట్సన్ సినిమాను తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు గా రీమేక్ చేసిన రమేష్ వర్మ, ప్రస్తుతం రవితేజ తో ఖిలాడి అనే చిత్రాని రూపొందిస్తున్నాడు.
ఈ చిత్రంలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాని భారీ బడ్జెట్ తో హవిస్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నాడు. రవితేజ ఈ చిత్రంలో అయిదు గురు విలన్స్ తో పోటీ పడుతున్నాడు. బాలీవుడ్ నుండి ఓ ఇద్దరు స్టార్ విలన్స్ ఇప్పటికే రంగంలోకి దిగారు. యాక్షన్ కింగ్ అర్జున్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు, సూర్య నటించిన సింగం 3, అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రాలలో విలన్ గా నటించిన పంజాబ్ కు చెందిన కండల వీరుడు, అనూప్ సింగ్ ఖిలాడి చిత్రంలో మరో విలన్ గా నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నలుగురు ఫైట్ మాస్టర్ లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. రవి తేజకు ఎంతో ఇష్టమైన రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ వీళ్ళు దాదాపుగా రవితేజ నటించిన అన్నీ చిత్రాలకు ఫైట్స్ ను కంపోస్ చేశారు. రీసెంట్ గా వచ్చిన క్రాక్ చిత్రంలో ఫైట్స్ బాగా ఉండటంతో ఖిలాడి లో కూడా అవకాశం ఇచ్చాడు. ఇక కొత్తగా చేరింది అన్బు-అరివు లు. రవితేజ కోసం స్పెషల్ ఫైట్స్ ను డిజైన్ చేస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన రవితేజ ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రం మే 28న ప్రపంచ వ్యాప్తంగ విడుదల అవ్వుతుంది.