యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఓం రౌత్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ లంకేష్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ కోసం ముంబై లోని గోరేగావ్ ఫిల్మ్ స్టూడియో లో భారీ సెట్స్ ను నిర్మించారు. నిన్న మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆదిపురుష్ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
అది లెవల్ 2 అగ్ని ప్రమాదం అని ఫైర్ సిబ్బంది అంటున్నారు. ఈ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మొత్తం 8 ఫైర్ ఇంజన్స్ , 5 జంబో ట్యాంకర్లు, ఒక్క వాటర్ ట్యాంకర్, ఓ జేసిబి రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం జరగడానికి ముందు అక్కడ 60 నుండి 70 మంది సభ్యులు ఉన్నారు. మంటలు వెలువడుతున్న సమయంలో వారు అక్కడ నుండి బయటకు వచ్చేశారు.
ఈ ప్రమాదంలో వారికి ఏ ప్రమాదం జరగలేదు. అందరూ సురక్షితంగానే బయట పడ్డారని ఆదిపురుష్ టీమ్ వెల్లడించింది. ప్రభాస్, సైఫ్ అలీఖాన్ లు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో లేరు. అగ్ని ప్రమాదం విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు కంగారు పడ్డ వారు అక్కడ లేరని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యారు. ఈ అగ్ని ప్రమాదం వలన నిర్మాతకు భారీగా నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియనున్నాయి.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ ను నటించనున్నదని వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రభాస్, కేజిఎఫ్ దర్శకుడి తో సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తెలంగాణలోని, గోదావరిఖని లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయక గా నటిస్తుంది.