శాజీమొన్ ప్రభాకర్ దర్శకత్వంలో మలయన్ కుంజు అనే మలయాళ చిత్రం రూపొందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో ఫహధ్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన నటించిన చిత్రాలు ఇప్పటివరకు ఎన్నో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2020లో వచ్చిన ట్రాన్స్ చిత్రంలోని తన నటన ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
విమర్శకుల, ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అయిన నటిస్తున్న మలయన్ కుంజు చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన షూటింగ్ సెట్స్ లో గాయాల పాలు అయ్యారు. అసలు కారణం ఏమిటి అంటే ఈ చిత్రంలోని ఓ సీన్ లో ఫాహిధ్ ఫాజల్ ఓ కాలిపోతున్న ఇంటి నుండి తనను తాను రక్షించుకునేందుకు ఆ ఇంటి నుండి బయటకు దుకేయ్యాలి. అలాంటి సమయంలో హీరో గోడ బయటకు దూకే సమయంలో కాలిపోతున్న ఇంటిలోకి అదుపు తప్పి పడి పోయాడు.
వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయాలు మాత్రం చాలా పెద్దవే అయ్యాయి కానీ అంత ప్రమాద కరమైనవి కావు అని వైద్యులు సూచించారు. కాకపోతే ఫజల్ ముక్కు కు పెద్ద గాయం మాత్రం అయింది. ఒక్కప్పుడు సినిమాలు చేస్తున్నారు అంటే కశ్చితంగా డూప్ ను పెట్టుకునేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఎంత రిస్కీ షాట్ అయిన తమ ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. అప్పుడే తమకు శాటిస్ ఫ్యాక్షన్ గా ఉంటుందని కుర్ర హీరోలు సైతం బల్ల గుడ్డి మరి చెబుతున్నారు.