మెగా హీరో వరుణ్ తేజ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ లు కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ కారణంగా ప్రస్తుతం ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందుతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్ లో ఇద్దరు హీరోలు పెళ్లాం ప్రియురాలితో పడే బాధలను చాలా ఫన్నీగా చూపించడం జరిగింది. కాని ఎఫ్ 3 లో మాత్రం పూర్తి విభిన్నంగా డబ్బు నేపథ్యం లో కథ సాగుతుందట.
ఇద్దరు హీరోలు డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను ఫన్నీగా చూపించారని తెలుస్తోంది. సినిమాలో ఇద్దరు హీరోలు మరియు హీరోయిన్స్ చేసే కామెడీకి తోడు సునీల్ మరియు రాజేంద్ర ప్రసాద్ కామెడీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించబోతున్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఒక కీలక విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న వెంకటేష్ మరియు వరుణ్ లకు సమానమైన పాత్ర కాకుండా మెగా హీరో వరుణ్ కు ఎక్కువ ప్రాముఖ్య ఉంటుందని టాక్ వినిపస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3 లో మెగా హీరో వరుణ్ తేజ్ కు ఎక్కువ ప్రాముఖ్యతను అనీల్ రావిపూడి కల్పించాడనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయం ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ ఆగస్టులో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. కరోనా పరిస్థితులు కుదుట పడితే ఆగస్టుల లో లేదంటే దసరాకు విడుదల అయ్యే అవకాశం ఉంది.