న్యాచురల్ స్టార్ నాని ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఇండస్ష్ట్రి లోకి అడుగు పెట్టిన హీరో. ఇప్పుడు సినిమాలోకి రావాలనుకునే కుర్ర హీరోలకు ఆదర్శంగా నిలుస్తారు. నాని తమ రోల్ మోడల్ గా కొంతమంది యువ యువ హీరోలు చెప్తుంటారు. అలాంటి నాని యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అంటూ ఓ నిర్మాత సంచలన ఆరోపణలు చేశాడు. ఇంతకు ఆ నిర్మాత ఎవరు అసలు ఏం జరిగిందో అతని మాటల్లోనే విందాం.
నాని హీరోగా గా కెరీర్ ను స్టార్ట్ చేసిన రోజుల్లో అల మొదలైంది, పిల్ల జమీందారు చిత్రాలు ఆయనను హీరోగా నిలబెట్టాయి. నాని కెరీర్ లోనే బెస్ట్ సినిమా ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది పిల్ల జమీందార్. ఈ చిత్రంలో పొగరు బట్టిన జమీందార్ పాత్రలో నాని బాగా నటించాడు. కామిడీ, లవ్, ఎమోషనల్ సీన్స్ అన్నీ బాగా పండటంతో సినిమా బాగా ఆడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డిఎస్ రావు నిర్మించాడు.
ఆ చిత్ర నిర్మాత ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాని పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాని పిల్ల జమీందార్ సినిమాకు బాగానే రెమ్యూనరేషన్ ఇచ్చాం. అది కాకుండా నాని ఓవర్సీస్ రైట్స్ ను తనకు ఇవ్వమని అడగడంతో కాదనలేకుండా నాని మొఖం చూసి ఇస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కనీసం నానికి కృతజ్ఞత భావం కూడా లేదు. యువ హీరో కొత్తగా వచ్చాడు అని ఎంకరేజ్ చేయడం నాది తప్పు.
కొత్తగా వచ్చిన హీరోలు… స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత తమకు లైఫ్ ఇచ్చినవారినే మర్చిపోతారు. అలాంటి వారిని ఎంకరేజ్ చెయ్యొద్దు. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఆపద సమయంలో ఏదో ఓ రూపంలో అదుకుంటారని నిర్మాత డిఎస్ రావు అన్నారు. నాని పై డిఎస్ రావు చేసిన ఆరోపణలపై ఏ విదంగా స్పందిస్తాడో చూడాలి.