సినిమా ప్రపంచంలో కొన్ని సినిమాలు మనసుకు బాగా హత్తుకుంటాయి. అందుకు కారణం ఏదైనా అయి ఉండవచ్చు. అ చిత్రంలోని లవ్ సీన్స్ కావచ్చు, యాక్షన్ , కామిడీ, ఎమోషనల్ ఇలా ఏదైనా కావచ్చు. పలాన సినిమాలో అతని కామిడీ బాగుంటుంది. ఎంత బాగా నటించాడు ర్రా అంటూ మనం మన ఫ్రెండ్స్ దగ్గర డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి సన్నివేశాలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. అలాంటి చిత్రాలు చాలా ఉన్నాయి.
మనం మహేష్ బాబు హీరోగా గుణ షెకార్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా చూసే ఉంటాం. ఆ చిత్రంలో మహేష్ బాబు తన యాక్టింగ్ తో ఇరగదీశాడు. ప్రకాష్ రాజ్ ఓబుల్ రెడ్డి పాత్రలో జీవించేశాడు. ఇప్పటికీ ఈ చిత్రం బుల్లితెరపై వస్తే బాగా అదరిస్తారు. ఇక ఈ చిత్రంలోని ముఖ్యంగా కామిడీ ట్రాక్ పరంగా చెప్పుకోవాలిసింది ధర్మవరపు సుబ్రమణ్యం గురించి. పాస్ పోర్ట్ ఆఫీసర్ పాత్రలో నవ్వులు పూయించాడు. ఆ చిత్రంలో మహేష్ బాబు, భూమిక పాస్ పోర్ట్ నిమిత్తం ధర్మవరపు సుబ్రమణ్యం వద్ద కు వెళ్ళుతాడు. ఆ సమయంలో ధర్మవరపు తాను తీసుకున్న కొత్త ఫ్యాన్సీ నంబర్ 9848032919 నుండి తన ప్రియురాలు పోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
అదే సమయంలో మహేష్ బాబు ఎంట్రీ ఇస్తారు. అప్పుడు పాస్ పోర్ట్ కోసం వచ్చాము అని చెబితే కొరియర్ లో పంపుతాము చేతికి ఇవ్వడం కుదరదు అని చెబుతాడు. ధర్మవరపు తాను తీసుకున్న కొత్త నెంబర్ నుండి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. అప్పుడు మహేష్ బాబు అండ్ గ్యాంగ్ ఆ ఫ్యాన్సీ నెంబర్ కు ఫోన్ చేసి ఓ ఆట ఆడుకుంటారు. అయితే ఆ నెంబర్ ఎవరిదై ఉంటుందని ఒక్కడు సినిమా టైంలో లక్షల్లో కాల్స్ కూడా వచ్చాయి. కానీ ఆ నెంబర్ ఎవరిదో మాత్రం తెలియదు. ఇంతకు ఆ ఫ్యాన్సీ నెంబర్ ఎవరిదో తెలుసా ఆ చిత్ర నిర్మాత ఎంఎస్ రాజుదని తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన ఆ నెంబర్ కు ఫోన్ కాల్స్ ఎక్కువ అవ్వడంతో ఆ నెంబర్ ను బ్లాక్ చేశాడని సమాచారం.