హైదరాబాద్ కు చెందిన దియా మీర్జా 2014లో సాహిల్ సంఘూ ని పెళ్లి చేసుకుంది ఓ అయిదు ఏండ్లు కలిసి కాపురం చేశారు. ఇద్దరి మధ్యమనస్పర్థలు రావడంతో 2019 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుండి ఆమె ఒంటరిగానే జీవిస్తూ ఉన్నారు. ఓ వైపు సినిమాలో నటిస్తూ మరో వైపు నిర్మాత గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె మరో పెళ్లి చేసుకుంది. వ్యాపారవేత్త అయిన వైభవ్ రేఖీని సోమవారం నాడు ఆమె పెళ్లి చేసుకుంది.
పెళ్లి అనంతరం వదువు వరులు వివాహా వేడుకనుండి బయటకు వచ్చి ఫోటోగ్రాఫర్లకు పోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా దియా ఎరుపు రంగు జరి ధరించి చాలా అందంగా కనిపించారు. వరుడు వైభవ్ రేఖీ తెలుపు రంగు కుర్తా చూడీదార్ దరించాడు. బంగారు వర్ణం దుపట్టాని ధరించాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి.
ఓ వీడియో లో దియా మీర్జా పెళ్లి మండపం వైపు నడిచి వస్తుండగా… మరో వీడియో లో పెళ్ళికి సిద్దం అయిన వదువు వరులను చూడవచ్చు. పెళ్లి మాత్రం హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకున్నారు. ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్స్ కు స్వీట్స్ పంచారు దియా మీర్జా. ఈ వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రకు చెందిన అదితిరావు హైదరీ, జాకీ భగ్నాని… గౌతమ్ గుప్తా లు వివాహానికి హాజరు అయ్యారు.