దర్శకుడు తేజ “చిత్రం” సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత వరస విజయాలను అందుకున్నాడు. నువ్వు నేను, జయం, వంటి సూపర్ హిట్టు చిత్రాలను తీశాడు. ప్రేమ కథలను తెరపై చూపించడంలో తేజ కు మంచి అనుభవం ఉంది. సున్నిత భావంతో కూడిన ప్రేమ కథలను తెరపై చూపించాడు. మహేశ్ బాబు తో “నిజం” అనే చిత్రం తీసి కెరీర్ లో మొదటి ప్లాప్ ను అందుకున్నాడు.
ఆ తర్వాత చాలా గ్యాప్…. రానా తో “నేనే రాజు నేనే మంత్రి” తో మరో పోలిటికల్ హిట్టు ను కొట్టాడు. ఈ మధ్య “సీత” చిత్రంతో ప్రేమ కథను తీసి మరో ప్లాప్ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు ఓ డిఫరెంట్ టైటిల్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. గోపిచంద్ ను హీరోగా గా తీసుకున్నాడు. “అలమేలుమంగా-వెంకటరమణ” హీరో గోపిచంద్ వెంకటరమణ గా నటిస్తుంటే అలమేలుమంగా కోసం దర్శకుడు అన్వేషించడం మొదలు పెట్టాడు. ముందుగా కాజల్ ను తీసుకోవాలి అనుకున్నారంట కానీ ఆమె డైరీ ఇప్పటికే ఫుల్ బిజీగా ఉంది ఆమె డేట్స్ అడ్జెస్ట్ అయ్యే పరిస్థితి లేదు.
ఆ తర్వాత సాయి పల్లవిని అనుకున్నారంట కానీ ఆమె చేతిలో నాలుగు సినిమాలు… ఓ రెండు సెట్స్ పైన ఉంటే మరో రెండు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. కావున సాయి పల్లవికూడా చేసే పరిస్థితి లేదు. మహానటి కీర్తి సురేశ్ వద్దకు వెళ్లారు ఆమె తమిళ, తెలుగు, హిందీ లు కలిపి ఆమె చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. కావున ఆమెకూడా నో చెప్పినట్లుగా తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత అన్నీ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళుతుండటంతో ముందుగానే దర్శక, నిర్మాతలు హీరోయిన్స్ ని బుక్ చేసుకుంటున్నారు. మరి అలమేలుమంగా గా తెలుగు అమ్మాయి వస్తుందా లేకపోతే బాలీవుడ్ నుండి వేరే ఎవరినైనా తీసుకుంటారా అనే విషయం తెలియాలిసి ఉంది.