సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా దర్శకుడిగా శంకర్ కు మంచి గుర్తింపు ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ మరియు పాన్ ఇండియా సినిమా ల దర్శకుడిగా ఎప్పుడో గుర్తింపు దక్కించుకున్న శంకర్ ఇండియన్ 2 విషయంలో చిక్కుల్లో పడ్డాడు. శంకర్ సినిమా ను అనుకన్న సమయానికి పూర్తి చేసి ఇవ్వలేదు అంటూ ఇండియన్ 2 నిర్మాతలు అయిన లైకా వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు మద్యవర్తిత్వంతో సమస్యను పరిష్కారం చేసుకోవాలంటూ సూచించినా కూడా వివాదం సర్ధుమనిగే పరిస్థితి కనిపించడం లేదు.
శంకర్ సినిమా ను ఈ ఏడాది జూన్ వరకు పూర్తి చేసి ఇచ్చే ఖరారు. కాని సినిమా ను ఇప్పటి వరకు కనీసం సగం షూటింగ్ కూడా పూర్తి చేయలేదు. దాంతో తమకు భారీ నష్టం చేకూరింది అంటూ లైకా వారు ఆరోపిస్తున్నారు. క్రేన్ యాక్సిడెంట్ ను మొదలుకుని పలు సమస్యల కారణంగా సినిమా ఆలస్యం అవుతోంది. చివరకు ఈ సినిమాను వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లైకా వారు సినిమా వల్ల మాకు ఏర్పడిన నష్టంను శంకర్ చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో శంకర్ ఉన్నారు.
శంకర్ ఇండియన్ 2 ను పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సమయంలోనే తెలుగు స్టార్ హీరో రామ్ చరణ్ తో మరియు హిందీ లో అపరిచితుడు సినిమా ను రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సమయంలో శంకర్ ఏ సినిమాలను చేయకూడదు అనే ఉద్దేశ్యంతో నిర్మాతలకు లైకా వారు లేఖలు రాశారు. ఇండియన్ 2 పూర్తి కాకుండా ఇతర నిర్మాతలు ఎవరు కూడా శంకర్ తో సినిమా లు కమిట్ అవ్వదంటూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తానికి శంకర్ తో రాజీ మార్గం కాకుండా ఢీ అంటే ఢీ అన్నట్లుగా లైకా వారు ప్రవర్తిస్తున్నారు.