మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152 వ చిత్రం ఆచార్య. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలోని కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. చిరంజీవికి శిష్యుడిగా సిద్దా పాత్రలో నటిస్తున్నాడు. పూజ హెగ్డే మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క కోకపేట పరిసర ప్రాంతంలో శరవేగంగా జరుపుకుంటుంది.
ఇప్పటికే దర్శకుడు టీజర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచాడు. అందుకే ఈ చిత్రం యొక్క అన్ని ఏరియాలకు సంబందించి థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. ఒక్క నైజాం ఏరియా మాత్రం పెండింగ్ లో ఉంది తాజా సమాచారం మేరకు ఆచార్య నిజామ్ రైట్స్ కోసం దిల్ రాజు, వరంగల్ శ్రీను లు పోటీ పడుతున్నారు. దాదాపుగా 40 cr వరకు వచ్చినట్లుగా తెలుస్తుంది.
ఆచార్య చిత్రానికి ఇప్పటివరకు అన్ని ఏరియాలకు సంబందించిన థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడు పోయాయి. ఈ చిత్రాని మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 13న దేశ వ్యాప్తంగ విడుదల అవ్వుతుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి మలయాళం మూవీ లూసిఫర్ ను తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెల్లుతుంది. రామ్ చరణ్ విషయానికి వస్తే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీత రామరాజు పాత్రలో నటిస్తున్నాడు.