ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాడు. తెలుగు సినిమాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగా బుట్టబొమ్మ సాంగ్‌కి పలుమార్లు స్టెప్పులేసి అలరించాడు.
అయితే తాజాగా సిడ్నీ వేదికగా నిన్న జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వీక్షకులు బుట్టబొమ్మ అంటూ గోల చేశారు. దీంతో బౌండరీ లైన్ దగ్గరున్న వార్నర్ ఈ సాంగ్‌కి సూపర్భ్‌గా స్టెప్పులు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, ఇది చూసిన నెటిజన్స్ మురిసిపోతున్నారు.