వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం డీ కంపెనీ పేరుతో సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంను మాఫియా డాన్ దావూద్, ఇబ్రాహిం, జీవితం ఆదారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం స్పార్క్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. తెలుగు, హింది బాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఆర్జివీ టీజర్ ను విడుదల చెయ్యడం జరిగింది.
ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఫోర్ లాక్ష్స్ కి పై గా వ్యూస్ ను రాబట్టింది. ఈ చిత్రం యొక్క కథ విషయానికి వస్తే ముంబై లో 1980 లో జరిగిన అల్లర్లను ప్రదానంగా చేసుకొని రూపొందిస్తున్నాడు. దావూద్ గ్యాంగ్ ఆ సమయంలో సృష్టించిన దాడులు, సామూహిక హత్యలను ఈ టీజర్ లో ఆర్జివీ చూపించాడు. వివాదాలను నిత్యం మోసుకువస్తున్న రామ్ గోపాల్ వర్మ మరి డీ కంపెనీ విషయంలో ఎలాంటి వివాదం తలెత్తనున్నదో మరి.
ఇప్పటికే ఆయన తీసిన పలు బయో పిక్ లు వివాదాని సృష్టించాయి. పరిటాల రవి జీవిత చరిత్రను రక్త చరిత్ర పేరుతో రెండు పార్టులుగా తీసి సంచలనం సృష్టించాడు. ఆ సమయంలో కొన్ని పత్రాలను చేదుగా చూపించినందుకు ఆయనకు బాగానే బెదిరింపులు వచ్చాయి కానీ వాటిని ఏవి లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాడు. ఎన్‌టిఆర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ల పోలిటికల్ కెరీర్ ను సినిమా రూపంలోకి మలిచిన ఆర్జివీ అభిమానులనుడి చాలా విమర్శలను ఎదురుకున్నాడు. ఇప్పుడు డీ కంపెనీ విషయంలో ఆర్జివీ ఎలాంటివి ఫేస్ చెయ్యనున్నాడో తెలియాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చెయ్యాలిసిందే.