సినీ నటి రకుల్ ప్రీతీ సింగ్ కరోనా బారినపడింది. రెండు , మూడు రోజులుగా ఒంట్లో బాగుండకపోవడం తో ఈమె కరోనా టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని రకుల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని తెలిపింది.
నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ మధ్య నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరుతున్నా. అందరూ జాగ్రత్తగా ఉండండ
ని రకుల్ పేర్కొంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టుతో బిజీగా ఉంది. ఇటీవలే రకుల్ మాల్దీవులు వెకేషన్ టూర్ లో సరదాగా ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.