టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంను కథ కాపీ విమర్శలు చుట్టు ముట్టాయి. ఇద్దరు రచయితలు ఆచార్య కథ నాది అంటే నాది అంటున్నారు. కొరటాల శివ వారి కథను దొంగిలించి ఈ సినిమా చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో చిరంజీవి స్పందన ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.
చిరంజీవి విభిన్నమైన గెటప్ లో కనిపిస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. కాని ఈ సినిమా కథ కాపీ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులకు కాస్త ఇబ్బందిగా మారింది.
మొదట ఈ కథను కన్నెగంటి అనీల్ కృష్ణ అనే వ్యక్తి తనది అంటూ మీడియా ముందుకు వచ్చాడు. పుణ్యభూమి అనే టైటిల్ తో నేను కథ రాసుకున్నాను. త్వరలో చేద్దామని అనుకున్నాను. ఇలాంటి సమయంలో కొరటాల శివ ఆచార్య సినిమాను తీస్తున్నారు. ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వివాదం కొనసాగున్న సమయంలోనే మరో సహాయ దర్శకుడు కమ్ రచయిత అయిన రాజేష్ మండూరి ఈ కథ తనది అంటూ మీడియా ముందుకు వచ్చాడు. ఈయన మీడియాకు ఇచ్చిన ప్రెస్ నోట్ లో తన వాదనను సుదీర్ఘంగా వినిపించాడు.
ప్రముఖ దర్శకుడు బి గోపాల్ శిష్యుడు అయిన రాజేష్ కొన్నాళ్ల క్రితం ఈ కథను మైత్రి మూవీ మేకర్స్ వారికి వినిపించాడట. వారు కథ బాగుందని ఇవ్వమన్నారట. అయితే రాజేష్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. పెద్ద దర్శకుడు అయితేనే కథకు న్యాయం జరుగుతుంది.
భారీ బడ్జెట్ తో ఇలాంటి సినిమాలను నిర్మించలేం అన్నారు. కొత్త దర్శకుడితో భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్దంగా లేము అంటూ క్లారిటీ ఇచ్చారట. దాంతో ఆ ప్రాజెక్ట్ ను మరో నిర్మాణ సంస్థలో చేయాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కొరటాల గారు చిరంజీవి గారితో ఆచార్య అంటూ తీస్తున్నారు అని తెలిసింది.
ఆ సినిమా కథ నాదే అంటూ తెలియడంతో కొరటాల గారిని చిరంజీవి గారిని కలిసేందుకు ప్రయతి్నంచాను. వారు కలిసేందుకు ఆసక్తి చూపలేదు. నాకు న్యాయం కావాలి అంటూ రాజేష్ డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు కథ కాపీ విషయంలో నిర్మాత చరణ్ కాని దర్శకుడు కొరటాల కాని స్పందించలేదు.