నటుడు సుధాకర్ అంటే ఇప్పటి జెనరేషన్ వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ పాత తరం జెనరేషన్ వాళ్ళకు బాగా తెలిసిన నటుడు చాలా సినిమాల్లో హీరోగా,విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా నటించాడు. తమిళ ప్రేక్షకులు సుధాకర్ ను ఓ హీరోలాగే చూసేవారు. ఎందుకు అంటే ఆయన అక్కడ చాలా సినిమాల్లో హీరోగా నటించాడు.
సుధాకర్ తెలుగు సినిమా ఇండస్ష్ట్రి లో ఓ వెలుగు వెలిగిన నటుడు అలాంటి నటుడు కొన్ని ఆరోగ్య కారణాల వలన ఆయన సినిమాలకు దూరం అయ్యాడు. ఆయన హీరోగా నటించే రోజుల్లో ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి ఆ విషయంపై హీరో సుధాకర్ ఒకానొక ఇంటర్వ్యూ లో క్లారిటి ఇచ్చాడు. ఆ హీరోయిన్ తో ప్రేమాయణంపై సుధాకర్ మాట్లాడుతూ… నేను ప్రముఖ నటి రాధికా చాలా సినిమాల్లో కలిసి నటించాము అందుకే మా పై గట్టి పుకార్లు వచ్చాయని సుధాకర్ తెలిపాడు. రాధికా నేను మంచి స్నేహితులం మాత్రమే అని అన్నాడు.
నా వివాహం కూడా తెలుగు దేశం పార్టీ స్థాపించిన రోజునే జరిగింది. నాది ఆరెంజ్డ్ మ్యారేజ్ మొదటి పెళ్లి చూపుల్లోనే ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు. అలాగే నా ఆరోగ్య సమస్యలపై రక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే నాకు కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాకు బ్రైన్ స్ట్రోక్ రావడంతో నేను కొంతకాలం పాటు కోమాలోనే ఉన్నాను. అని నటుడు సుధాకర్ చెప్పాడు