ఇండియా లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను దానిపై ఉన్న అపోహను పోగొట్టాలి అనే ఉద్దేశ్యంతో నటుడు వివేక్ కరోనా టీకాను వేయించుకున్నాడు. ఆల్రెడీ గుండె సమస్యలతో బాదపడుతున్న వివేక్ ధైర్యం చేసి టీకా తీసుకోగా..అది తీసుకున్న మరుసటి రోజే మృత్యువాత పడ్డారు. ఇక ఆయన మరణంపై తెలుగు, తమిళ సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన దహన సంస్కారాలను విరుగంబక్కం అనే ప్రాంతానికి సమీపంలో చేశారు.
ఇక అస్థికలను ఆయన సొంత ఉరు పెరంగటూరు కు తరలించారు. వివేక్ బందువులు, గ్రామస్థులు ఆయన అస్థికలను మొక్కలు నాటాడానికి ఉపయోగిస్తున్నారు. అవును వివేక్ కు చిన్నపాటి నుండి మొక్కలు అంటే చాలా ఇష్టం అంట అందుకే కోటి మొక్కలను నాటాలనే సంకల్పం ను పెట్టుకున్నాడు. అయిన చనిపోయే వరకు 33 లక్షల మొక్కలను నాటాడు. 2011 లో గ్రీన్ కలామ్ అనే ప్రాజెక్ట్ ను స్థాపించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపు నిచ్చాడు. తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ రమ్యా వివేక్ పై ఉన్న అభిమానాన్ని 59 మొక్కలు నాటి చాటుకున్నారు. వివేక్ వయసు కూడా 59 అని ఆమె చెప్పారు.