సినిమా అంటేనే ఎన్నో కష్టాలతో కూడుకున్నది. సినిమా ఫెయ్యిల్ అయిన, మధ్యలో ఆగిపోయిన, హీరోకిగాని, అటు నిర్మాతకు,దర్శకుడికి చాలా నష్టం జరుగుతుంది. సరిగ్గా అలాంటిదే టాలీవుడ్ కు చెందిన బడా స్టార్ విషయంలో జరిగింది. హీరోగారికి మరియు ప్రముఖ బ్యానర్ కి మధ్య ఈ గొడవ మొదలైంది. కెరీర్ లో మంచి హిట్స్ కొట్టి దూకుడు మీద ఉన్న ఆ హీరో ఓ ప్రముఖ బ్యానర్ లో సినిమాను మొదలు పెట్టాడు.
అందుకు ఆ బ్యానర్ వాళ్ళు కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఓ 12 రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. ఓ యువ దర్శకుడు ఆ బ్యానర్ ద్వారా ఈ చిత్రానికి పరిచయం అవ్వుతున్నాడు. అయితే హీరోగారి కోటి రూపాయల సెటిల్ మెంట్ విషయంలో వారికి గొడవలు వచ్చాయని తెలుస్తుంది. అందుకే సినిమా షూటింగ్ నిలిచిపోయిందని ఆ గొడవలు ఇంకా కంటిన్యూ కావడంతో ఇప్పట్లో ఆ సినిమా ప్రారంభం కాదు అనుకున్నారు.
కానీ ఓ యువ నిర్మాత ఆ ఆగిపోయిన సినిమాను టేకప్ చేస్తున్నాడు. ఆ యువ నిర్మాత, హీరోగారికి కోటిన్నర వరకు పారితోషికం ఇచ్చాడని తెలుస్తుంది. నాలుగు కోట్ల పారితోషకం తీసుకునే ఆ హీరో సినిమా మధ్యలో అగోపోకూడదు అనే ఈ నిర్ణయం తీసుకునట్లుగా సమాచారం. ఈ చిత్రంలో మొదట నుండి కూడా తెలుగు అమ్మాయి ని హీరోయిన్ గా తీసుకోవాలని ఆనుకున్నారంట. అందుకే ఆ హీరోయిన్ నే ఈ సినిమా కోసం తీసుకున్నారు. మరి ఆ హీరో కి ఆ బ్యానర్ కి మధ్య గొడవకు పరిష్కారం దిశ గా సినిమా పరిశ్రమకు చెందిన కొంత మంది పెద్దలు చర్చలు జరుపుతున్నారు.