పవన్ కల్యాణ్ మూవీ భీమ్లా నాయక్ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ తర్వాత పవన్ సినిమా కావడంతో… ఫ్యాన్స్ కళ్లకు కాయలు కాసేలా భీమ్లా నాయక్ కోసం వేచి చూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన భీమ్లా నాయక్.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. ఇందులో పవన్ కల్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. అంచనాలు మిస్ కాకూడదన్న ఉద్దేశంతో భీమ్లా నాయక్ నిర్మాతలు పృకూడా ప్రమోషన్స్ చేస్తూ జనాలకు మరింత చేరువ చేస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ రేపు రేపు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిన్న గ్రాండ్ గా జరిపారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీసు మైదానంలో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు అయ్యారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు పడవు.. ఇది కళాకారుడి ప్రాంతం.. వారికీ కులం, మతం అనే తేడాలు ఉండవు. ఎక్కడో చెన్నై నుండి హైదరాబాద్ కు తరలివచ్చిన తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో మంది కృషి చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ సినీ రంగానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నాను అని అన్నారు. అక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను అని చెప్పాడు పవన్.
నేను ప్రజా జీవితంలో ఉన్నా… కానీ సినిమానే నాకు అన్నం పెట్టేది. సినిమానే ఇంత మంది అభిమానులను నాకు భిక్షగా అందించింది. ఒక వేళ సినిమాల్లో లేకపోతే ప్రజా సేవలో కూడా ఉండే వాడిని కాదేమో అని పవన్ కల్యాణ్ అన్నారు.