చిరంజీవి 152 వ చిత్రం గా ఆచార్య చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, చిరంజీవి పై దర్శకుడు కొరటాల శివ కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి చెప్పే డైలాగ్ లు అందరిని ఆకట్టుకునే విదంగా ఉంటాయని మోటివేషనల్, ఆ మాటలను చాలా మంది ప్రేక్షకులు ఇన్స్పిరేషన్ గా తీసుకునే అవకాశం ఉందని ఈ చిత్రానికి ఈ మాటలే హైలెట్ అవ్వుతాయని చిత్రా బృందం నుండి అందుతున్న సమాచారం.
గత చిత్రాలలోను కొరటాల శివ ఈ లాంటి డైలాగులతోనే ఆకట్టుకున్నాడు. అందుకే ఆచార్య కోసం అంతకన్న పవర్ ఫుల్ మాటలను చిరంజీవి తో చెప్పిస్తున్నాడు . ఇక ఈ చిత్రంలో చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. చరణ్ కి జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చర్రి, నిరంజన్ రెడ్డి కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మలయాళం మూవీ లూసిఫర్ ను తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించనున్నాడు.
దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రం తర్వాత అల్లు అర్జున్ తో ఓ సినిమా చెయ్యనున్నాడు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ పుష్ప తో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్ మాత్రం ఓ వైపు సినిమాలు నిర్మిస్తు మరోవైపు నటుడిగా రానిస్తున్నాడు. రాజమౌళి పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఆచార్య చిత్రంను సమ్మర్ లో విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.