మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. కాగా ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మలయాళ రీమేక్ లూసిఫర్, తమిళ రీమేక్ వేదాళం చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అయితే వీటిల్లో ఏ మూవీ ముందుగా సెట్స్ పైకి వెళ్తుందనేది అర్ధం కాక అభిమానులు అయోమయం అవుతున్నారు. ప్రస్తుతం మెగా వర్గాల సమాచారం మేరకు లూసిఫర్ మొదట సెట్స్‌పైకి వెళ్లనుందట. తమిళ ఇండస్ట్రీలో రీమేక్ స్పెషలిస్టుగా పేరుగాంచిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు మోహన్ రాజా అయితే ఫర్ ఫెక్ట్ గా ఉంటుందని చిరు ఫిక్సయినట్టు టాక్. ఆచార్య షెడ్యూల్ పూర్తయిన వెంటనే జనవరి నుంచి లూసిఫర్ సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిరంజీవి టీం రెడీ అవుతుందని అంటున్నారు. ఇది పూర్తి అయినా తర్వాతే వేదాళం చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొస్తారట.