సైరా నరసింహా రెడ్డి చిత్రం తర్వాత చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తుంది. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు నిరంజన్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ రెండు రీమేక్ చిత్రాల్లో నటించనున్నాడు.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదళం, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్. ఈ రెండు రీమేక్ చిత్రాల్లో మెగాస్టార్ నటించనున్నాడు. వేదళం రిమేకు ను తెలుగులో మెహర్ రమేష్ తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు. ఇకా మలయాళం సినిమా లూసిఫర్ సినిమా విషయానికి వస్తే తెలుగులో ఈ చిత్రాన్నికి మొదట సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తాడు అనే వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత వివి వినాయక్ పేరు కూడా ఈ లిస్ట్ లోకి వచ్చింది. ఇప్పుడు మరో దర్శకుడు వచ్చి చేరాడు. తాజాగా అందుతున్న సమాచారం మేరకే ఆ దర్శకుడే ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ దర్శకుడు మరెవరో కాదు. మోహన్ రాజా ఈయన తెలుగులో హనుమాన్ జంక్షన్ ను తీశాడు. తమిళ్ లో జయం, తని ఒరువన్, వేలాయుదమ్, వంటి సూపర్ హిట్ట్ చిత్రాలను తీశాడు. ఇప్పుడు ఆయన చేతికి రీమేక్ రైట్స్ ను మెగాస్టార్ అప్పజెప్పాడు.
తెలుగు నేటివిటీ తగిన విదంగాను, మెగా ఫ్యాన్స్ అభిరుచికి తగట్లుగా స్క్రిప్ట్ ను రెడీ చేశాడు అంట. త్వరలోనే లూసిఫర్ సెట్స్ పైకి వెళ్లనున్నదని సమాచారం. జనవరి 21 న పూజ కార్యక్రమాలతో ఈ చిత్రం మొదలవ్వుతూందని ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వస్తున్నాయి. మలయాళం లూసిఫర్ లో మోహన్ లాల్ కి జోడీగా హీరోయిన్ లేదు. తెలుగు రీమేక్ లో మెగాస్టార్ కి హీరోయిన్ కోసం ఓ పాత్రను సృష్టిస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు అగాలిసిందే.