మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమా అనేక కారణాల వల్ల గత రెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. సైరా సినిమా కారణంగా ఆచార్యని వాయిదా వేస్తూ వచ్చిన దర్శకుడు కొరటాల శివ ఎట్టకేలకు గత ఏడాది షూటింగ్ ప్రారంభించాడు. షూటింగ్ ప్రారంభించిన కొన్నాళ్ళకి కరోనా వల్ల ఆగిపోయింది. ఇప్పటి వరకు 30 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం అందుతోంది.
షూటింగ్ లో మళ్ళీ పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గా కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే దర్శకుడు కొరటాల శివ ఈ ఏడాది చివరి వరకు ఆచార్య సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ఉద్దేశంతో లేడట. మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్య పరిస్థితి మరియు కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ ను ఆలస్యం చేయడమే మంచిది అన్నట్లుగా ఆయన భావిస్తున్నాడు. హడావుడిగా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశామని పెంచుకోకుండా మెల్లగానే షూటింగ్ చేయించాలని భావిస్తున్నాను.
దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా విషయంలో ప్రతిష్టాత్మకంగా ఉన్నారు. ఆయనకు ఇది చాలా ముఖ్యమైన సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఇక చిరంజీవి తో చేసిన సినిమా అవడం వల్ల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అంచనాలను అందుకో వాలంటే దర్శకుడు కొరటాల శివ చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి సినిమాకు పూర్తి చేయడం కంటే కాస్త ఆలస్యమైనా నిదానంగా పూర్తి చేసి మంచి అవుట్ పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు ఉన్నాడు.
ఆ కారణంగానే ఈ ఏడాది చివరి వరకు వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా ప్రారంభించి వచ్చే ఏడాది దసరాకు సినిమాను నిదానంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయనకు జోడీగా ముద్దుగుమ్మ రష్మిక మందన నటించే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ విషయాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ఆచార్య ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.