మెగాసార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్ని వర్గాల వారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి నటించడంతో పాటు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల కూడా సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కొరటాల శివ ఇప్పటి వరకు అన్ని సూపర్ హిట్స్ దక్కించుకున్నాయి. అందుకే ఈ సినిమా కూడా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే అప్పుడే అంతా కూడా నమ్మకంగా ఉన్నారు.
చిరంజీవి రెండు విభిన్నమైన గెటప్స్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను మద్యలో కరోనా కారణంగా నిలిపేశారు. కరోనా ఇప్పట్లో వదిలి వెళ్లి పోయే అవకాశం కనిపించడం లేదు. ఆ కారణంగా షూటింగ్ లు మొదలు అవుతున్నాయి. చిరంజీవి కూడా గత ఆరు ఏడు నెలలుగా ఎదురు చూస్తున్నారు. కాని ఇప్పట్లో షూటింగ్స్‌కు అన్ని విధాలుగా అనుకూల అంశాలు కలిగే అవకాశం లేదు. అయినా కూడా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేయబోతున్నారు.
ఆచార్య షూటింగ్‌ను వచ్చే నెల చివరి నుండి లేదా నవంబర్ నుండి షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆచార్య షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే రామ్ చరణ్ కూడా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కోసం చరణ్ దాదాపు 20 నుండి 30 రోజుల పాటు డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు. మొదట చిన్న పాత్రే అనుకున్నప్పటికి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి చివరకు సినిమాలో చరణ్ పాత్రను కీలకంగా మార్చారు.
ఇప్పుడు ఆయన పాత్రకు హీరోయిన్ కూడా ఉంటుంది. రష్మిక హీరోయిన్గా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, చిరంజీవికి జోడీగా కాజల్ నటించబోతున్న విషయం తెల్సిందే. ఆచార్య సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆ విషయంలో చాలా క్లారిటీగా యూనిట్ సభ్యులు ఉన్నారు.