మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి రీ ఎంట్రీ తర్వాత ఆయన వరస హిట్స్ తో దుసుకెళ్లుతున్నాడు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ కి జోడీగా నటిస్తుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పైన రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని సమ్మర్ లో విడుదల చెయ్యడానికి దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.
ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే మరో చిత్రంలో చిరంజీవి నటించడానికి రంగం సిద్దం అయింది. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ “అయ్యప్పనుమ్ కొషియమ్” ను తెలుగు రీమేక్ లో చిరంజీవి నటించడానికి సిద్దం అవ్వుతున్నాడు. రామ్ చరణ్ ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను చాలా ఇష్టపడి కొన్నాడు. మొదట ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపించిన చివరికి తమిళ దర్శకుడు మోహన్ రాజ చేతిలోకి వెళ్లింది. ఆయన తెలుగు నేటివిటికి తగిన విదంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడు. అయితే ఈ సినిమాను హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ సూపర్ గుడ్ ఫిల్మ్ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించాడు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, దర్శకుడు మోహన్ రాజ, అల్లు అరవింద్, అశ్వనీదత్, కొరటాల శివ, జెమినీ కిరణ్, ఠాగూర్ మధు, మెహర్ రమేశ్, రామ్ ఆచంట, గోపి ఆచంట తదితర టెక్నీషియన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ…మెగా ఫ్యాన్స్ కోరుకునే విదంగా ఈ చిత్రం ఉంటుంది. చిరంజీవి గారికి ఇది విభిన్నమైన చిత్రంగా నిలిచిపోతుంది. చిరంజీవి గారితో ఎప్పటినుండో ఓ సినిమా చెయ్యాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన తో కలిసి షూటింగ్ సెట్స్ ను పంచుకోవడం అదృష్టంగా భావిస్తాను అన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.