బాలీవుడ్ లో విజయవంతమైన పింక్ చిత్రాన్ని తమిళంలో అజిత్ ముఖ్యపాత్రలో నేర్కొండ పార్వాయి
అనే పేరుతో రీమేక్ చేశారు.. ఈ చిత్రం గురుంచి సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఓ ట్వీట్ చేశారు… ఏమని అనగా… ఈ చిత్రంలో సోషల్ అవేర్నెస్స్ తెచ్చే మంచి సందేశం ఉన్నది…నిజానికి నేను హింసాత్మకంగా మరియు భావోద్వేగాలు ఉండే సినిమాలు చూడను… కామెడి సినిమాలు ఎక్కువగా చూస్తాను… నేర్కొండ పార్వాయి
కూడా హింసాత్మక మరియు భావోద్వేగాలు ఉన్న సినిమా అనుకుని ఇన్ని రోజులు చూడలేదు… ఆ తరువాత ధైర్యం తెచ్చుకుని ఎట్టకేలకు చూశాను.
సినిమా చాలా బాగా ఉన్నది.. దర్శకుడు చాలా మంచి సందేశం ఇచ్చారు… అలాంటి సినిమాను అజిత్ లాంటి పెద్ద స్టార్లు చెయ్యడం చాలా సంతోషం వేస్తుంది.. తెలుగు లో ఆ చిత్రాన్ని పవన్ కల్యాణ్ వకీల్ సాహెబ్ పేరుతో చెయ్యడం చాలా సంతోషకరం… నేర్కొండ పార్వాయి
, డియర్ కామ్రేడ్
, బ్రోచేవారెవరురా
, లాంటి సినిమాలు తీసిన దర్శకుల మరియు రచయితలను చూసి గర్వపడుతున్నాను వారి యొక్క సున్నితమైన మనసుకు నా ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు… చిన్మయి సోషల్ మీడియా ద్వారా మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రశ్నించే వ్యక్తిగా ఎప్పుడు ముందువరసలో ఉంటారు…