
ప్రుమఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. భారత గాన కోకిల, దిగ్గజ గాయని లతా దీదీ ఇక లేరు. నా గుండె ముక్కలయిందంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఆమె లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరని ఆవేదన చెందారు. సంగీతం సజీవంగా ఉన్నంత వరకు ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయని చిరు తెలిపారు.

అలాగే లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణ వార్త తనను ఎంతగానో బాధించిందంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. మా గానకోకిల మూగబోయింది.. మా మధ్య మీరు లేకపోవచ్చేమో కానీ మీరు పాడిన పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటాయని అన్నారు. పాటలో ఒకే ఒక్క లైన్ తో మమ్మల్ని ఎన్నో అనుభూతలు పొందేలా చేసిన మీరు.. మా అందరి మంది ఎప్పటికీ నిలిచే ఉంటారంటూ ఎమోషనల్ అయ్యారు.

అంతే కాదండోయ్ హీరోయిన్ పూజా హెగ్డే, హీరో జూనియర్ ఎన్టీఆర్, ఏఆర్ రహ్మాన్, డైరెక్టర్ రాజమౌళి, హీరోయిన్ కాజల్ అగర్వాల్, హీరో అడివి శేష్, హీరో సాయి ధరమ్ తేజ్, కథానాయిక ప్రగ్యా జైశ్వాల్, హీరోయిన్ తమన్నా, జెనీలియా దేశ్ ముఖ్, హీరో మంచు విష్ణు, కథానాయిక మెహ్రీన్ పిర్జాదా, సినీ నటి దక్షా నాగర్కర్ తదితరులు లతా మంగేష్కర్ మృతి పట్ల ఘన నివాళులు అందించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్లు చేశారు.