బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతిపై కేంద్రం సీబీఐ ఎంక్వౌరీ జరుగుతున్న విషయం తెల్సిందే. సుశాంత్ ను హత్య చేశారని లేదంటే సుశాంత్ మృతి చెందేలా కొందరు చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రియా చక్రవర్తిపై అనుమానాలు ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. అయితే గత వారం రోజులుగా కేసును విచారిస్తున్న సీబీఐ వారు నేడు కీలక ప్రకటన చేశారు.
ఇప్పటి వరకు సుశాంత్‌ను ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే విషయంలో మాకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆయన మృతికి కారణం ఏంటీ అనే కోణంలో మేము ఎంక్వౌరీ చేస్తున్నామని పేర్కొన్నాడు. అయితే సుశాంత్ మృతిపై కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజం కాదంటూ కొందరు ఇప్పటికే అంటున్నారు. సీబీఐ వారు కూడా త్వరలో ఇదే అభిప్రాయంకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
త్వరలోనే సీబీఐ ఈ కేసును ముగించేస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. సుశాంత్ డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవమే అయితే రియా చక్రవర్తి అతడి నుండి విడిపోయిన తర్వాత అతడు మరింత డిప్రెషన్‌కు గురి అయ్యాడు. ఆమె తో ప్రేమ విఫలం అవ్వడం ఆమె ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేయడం వంటివి చేయడంతో సుశాంత్ బాగా నొచ్చుకున్నాడని అందుకే ఆత్మహత్యకు ఒడిగట్టి ఉంటాడు అంటూ ప్రాధమిక విచారణలో ముంబయి పోలీసులు నిర్థారించారు.
ఇదే విషయాన్ని సీబీఐ వారు చెప్పనున్నారా లేదంటే కొత్తగా ఏమైనా విషయాలను వారు బయటకు తీస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సుశాంత్ కుటుంబ సభ్యులు మరియు ఇతర బాలీవుడ్ వర్గాల వారిని కూడా ప్రశ్నిస్తారని అంటున్నారు.