రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ..మరోసారి స్టైలిష్ అల్లు అర్జున్ ఫై తనకున్న ప్రేమను వ్యక్తం చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు. విజయ్ కేవలం సినిమాలతోనే కాక పలు బిజినెస్ లు కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ రౌడీ బ్రాండ్ అనే పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రౌడీ బ్రాండ్‌కి సంబంధించిన స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ని తయారు చేయిస్తుంటాడు. వీటిని యూత్ తెగ ఇష్టపడుతూ కొనుగోలు చేస్తుంటారు. అంతే కాదు సినీ స్టార్స్ సైతం వీటిపై ఆసక్తి కనబరుస్తుంటారు. గతంలో విజయ్ తాను డిజైన్ చేసిన బట్టలకు అల్లు అర్జున్ కు బహుమతిగా పంపగా, వాటిని అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి వేడుకలో ధరించాడు.
ఇప్పుడు మరోసారి విజయ్ ..అర్జున్ కు బట్టలు పంపించగా..దానికి గాను బన్నీ విజయ్ కి థాంక్స్ చెప్పాడు. నువ్వు పంపిన బట్టలు చాలా కంఫోర్ట్‌గా ఉన్నాయి. నువ్వు చూపించే ఈ ప్రేమకు నా ధన్యవాదాలు అన్నీ బన్నీ తన ట్విట్టర్లో తెలిపాడు. అంతేకాకుండా ఆ బట్టలు ధరించి దిగిన ఫొటోలని కూడా షేర్ చేశాడు.
I want to thank my brother @TheDeverakonda and the @therowdyclub team for sending me this cool pair . It’s super comfy . Thank you for the lovely gesture my brother . Shine on ! pic.twitter.com/aBSmra9QXM— Allu Arjun (@alluarjun) December 3, 2020