ధర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టిఆర్ లు నటిస్తున్నారు. కీలక పాత్రలో అజయ్ దేవగన్, సముద్రఖని లు నటిస్తున్నారు. హీరోయిన్స్ పాత్రలో అలియ భట్, ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారు. పీరియాడికల్ నేపథ్యం కలిగిన సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన హీరోల టీజర్స్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాని దసర కు అంటే అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి బాలీవుడ్ నిర్మాత బోణి కపూర్ ఆర్ఆర్ఆర్ చిత్రంపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. అందుకు కారణం అమీత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా మైధాన్ అనే చిత్రం రూపొందింది. నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావలిసింది. కానీ కరోనా కారణంగ పోస్ట్ పోన్ చేశారు.
థియేటర్స్ కు అనుమతులు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాని అక్టోబర్ 15 న విడుదల చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత బోణి కపూర్ ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలో కామన్ గా నటించిన వ్యక్తి అజయ్ దేవగన్. అయితే ఈ విషయంపై బోణి కపూర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నేను మైధాన్ సినిమా విడుదల తేదీన ప్రకటించిన రెండు రోజుల్లోనే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రకటించాడు.
ఈ విషయంపై రాజమౌళి కి ఫోన్ చేసి విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసుకోవాలిసిందిగా కోరాను. ఈ విషయంపై రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ బాధ్యత నాది కాదు. అది నిర్మాతలకు సంబందిచ్చిన విషయం, వారికి పోన్ చేసి మాట్లాడండి అని చెప్పాడు. అయితే తాను చెప్పిన మాటలను నేను నమ్మదలుచుకోలేదు. బహుశా ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయం అజయ్ దేవగన్ కు తెలిసి ఉండకపోవచ్చు అని అభిప్రాయ పడ్డాడు.
మంచి పేరు ఉన్న రాజమౌళి ఇలా చేస్తాడు అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆయనపై ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని అన్నాడు. బోణి కపూర్ ఇంకా మాట్లాడుతూ మైదాన్ చిత్రం కోసం చాలా ఖర్చు చేశాం అని చెప్పాడు. ఈ చిత్రం ఫూట్ బాల్ నేపథ్యంలో రూపొందింది.