డర్టీ పిక్చర్ తో కుర్రకారును ఓ ఊపు ఊపిన బ్యూటీ విద్యాబాలన్. అందాల ఆరబోతతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలను ఎంచుకొని… తాను చేసిన ప్రతీ చిత్రంలోనూ తనదైన ముద్ర వేస్తోంది ఈ ముద్దుగుమ్మ. జనవరి 1, 1979లో ముంబయిలో పుట్టిన విద్య… డర్టీ పిక్చర్ తో మంచి పేరు సంపాదించుకుంది. సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. దక్షిణాది చిత్రాలతో పాటుగా బాలీవుడ్ లోనూ తనదైన శైలిలో పాత్రల్లో ఒదిగిపోయి… ప్రేక్షక దేవుళ్ల మన్ననలు పొందింది.
తెలుగులో నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో నటించిన ఈ భామ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. కథ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండే సినిమాలతోపాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకుని అభిమానులకు మరింత దగ్గరయింది. 2012లో ప్రముఖ నిర్మాత అయినటువంటి సిద్దార్థ రాయ్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. అయినా సినిమాలకు దూరం కాకుండా ఇప్పటికీ సినిమాలపై దృష్టి పెట్టి తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
సన్నివేశ అవసరాన్ని బట్టి బోల్డ్ గా నటించడానికి కూడా విద్యాబాలన్ వెనకాడలేదు. కథకూ ఉన్నటువంటి బలాన్ని బట్టి తాను ఎంత వరకైనా సిద్ధమని ఇప్పటికే చాలా సార్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె చేతిలో జల్సా సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. తనపాత్రను ఎంపిక చేసుకునే విషయంలో విద్య… చాలా తెలివిగా వ్యవహరిస్తుంటుందని ఆమె సన్నిహితులు చెబుతారు. అందుకే తెరపై కనిపించే ప్రతీపాత్రకు ఆమె వందశాతం న్యాయం చేస్తారు. దీనికి కారణం పాత్రలో నటించడం కాదు… ఆమె జీవిస్తారు. మరీ ఈ నటీమణి పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా విద్యాబాలన్ కు హ్యాహీ బర్త్ డే.