జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఆమె తండ్రి బోనీ కపూర్ అదిరిపోయే విషయాన్ని తెలిపారు. త్వరలోనే ఆమె తెలుగు సినిమాల్లో నటించబోతుందని వలీమై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించారు. అయిచే జాన్వీ పూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. అయితే ధడక్ సినిమాతో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న ఈ అమ్మడు తెలుసు సహా దక్షిణాది సినిమాల్లో నటించడం ఖాయమని ఆమె తండ్రి బోనీ కపూర్ చెప్పడం… దక్షిణాది ప్రజలందరనీ ఆనందానికి గురి చేస్తోంది.
అయితే తమకు దక్షిణాది పరిశ్రమ అంటే చాలా ఇష్టమని బోనీ కపూర్ తెలిపారు. ఆయన భార్య.. అందాల తార శ్రీదేవి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి మెప్పించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమె బాటలోనే తమ కూతురు జాన్వీ కపూర్ కూడా నడుస్తుందని ఆయన వివరించారు. మెత్తంగా జాన్వీ సౌత్ ఇండస్ట్రీ ఎంట్రీపై ఉన్న అనుమానాలను పటా పంటలు చేశారు.
అమ్మలాగే జాన్వీ కపూర్ కూడా చాలా అందగత్తె. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, అప్డేట్ లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈమె వేసుకునే బట్టలపై చాలా సార్లు నెగటివ్ కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ ఆమె అవేం పట్టించుకోకుండా తనకు నచ్చినట్టుగా ఉంటూనే… తన పని తాను చేసుకుపోతుంది. అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్ మెదలగు సినిమాల్లో నటిస్తుంది.
వరుస సినిమాలతోనే కాకుండా పలు యాడ్స్ లో జాన్వీ నటిస్తోంది. తమ క్రియేటివ్ కాస్ట్యూమ్స్ ని జాన్వీకి వేయించి యాడ్స్ చేయించుకుంటూ.. ఆమెను యూత్ స్టైల్ ఐకాన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తన అందాలను ఆరబోస్తూ.. జాన్వీ కూడా అద్భుతంగా నటిస్తోంది.