బిగ్ బాస్ సీజన్ 4లో అసలు మజా ఇప్పుడు మొదలైందని చెప్పాలి.. ఇప్పటివరకు సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన హౌజ్ మేట్స్ ఇక మీదట దానికి ఛాన్స్ లేదని తేలింది. నామినేషన్స్ లో ఉండకుండా జాగ్రత్త పడటమే మొదటి స్టెప్ ఆ తర్వాత స్ట్రాంగ్ or వీక్ ఏదైనా సరే ఆడియెన్స్ ఓటేస్తేనే హౌజ్ లో కొనసాగేది లేదంటే పెట్టాబేడా సర్ధేయాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 4లో ఇప్పటివరకు జరిగిన నాలుగు వారాలు ఒక లెక్క ఇక మీదట జరిగేది ఒక లెక్క.
ఎవరికి వారు తమ గేమ్ ప్లాన్ తో దూసుకెళ్తున్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియలో చిన్నపాటి రణరంగాన్ని గుర్తుచేసింది. అభిజిత్ వర్సెస్ అఖిల్ ఈ ఇద్దరి మధ్య వాగ్వివాదం హైలెట్ గా నిలిచింది. అయితే అఖిల్ మధ్యలో మోనాల్ టాపిక్ తీసుకురావడంతో మోనాల్ చాలా హర్ట్ అయ్యింది. మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ గురించి మాత్రమే మాట్లాడండి అంతేకాని తన గురించి ఎందుకని మోనాల్ ఏడుస్తూ చెప్పింది. ఈ షోని ప్రపంచం మొత్తం చూస్తుందని మీరు నా గురించి మాట్లాడొద్దని ఏడుస్తూ బాధతో చెప్పింది మోనాల్.
అఖిల్ మీదకు అభిజిత్ ఎటాకింగ్ కు దిగగానే అతనికి సపోర్ట్ చేస్తూ సోహెల్ మళ్ళీ తన ఉగ్రరూపాన్ని బయటపెట్టాడు. అతనికి ఏమాత్రం సంబందం లేని విషయంపై సొహెల్ అలా ఫైర్ అవడం మధ్యలో దివి కలుగచేసుకుని నువ్వలా మాట్లాడటం నచ్చలేదని చెప్పడం నామినేషన్స్ టైం లో హాట్ హాట్ గా డిస్కషన్ నడిచింది. ఫైనల్ గా ఈ వారం 9 మంది హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో అభిజిత్, నోయెల్, అరియానా, సుజాత, లాస్య, అఖిల్, మోనాల్, సోహెల్, అమ్మా రాజశేఖర్ ఉన్నారు.