దేశవ్యాప్తంగా పలు భాషల్లో ప్రసారమవుతూ సూపర్ క్రేజ్ దక్కించుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్. అందులో పాల్గొన్న ప్రతీ ఒక్కరూ మంచి గుర్తింపు తెచ్చుకొని అనేక సినిమాలు ప్రోగ్రామ్ లలో నటిస్తున్నారు. అంతే కాదండోయ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ల జీవితాలు బిగ్ బాస్ కు ముందు బిగ్ బాస్ తర్వాత అన్నట్లుగా ఉంటుంది. కొందరికి ఎంతో ఫేమ్ ను తీసుకచ్చిన ఈ బిగ్ బాస్ షో మరి కొందరికి నెగిటివిటీని కూడా తీసుకొస్తుంది.
అలా సీజన్ 2 లో విన్నర్ అయిన కౌషల్ మండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్ లందరికీ నచ్చిన కౌశల్ మండ విన్నర్ అయి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కూడా చాలా నెగిటివిటీని సొంతం చేసుకున్నాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఎన్నో గొడవలుతో కొన్నాళ్ల పాటు సెన్సేషన్ గా మారాడు. అయితే ప్రస్తుతం ఆయన ఇస్మార్ట్ జోడీ కార్యక్రమంలో ఆయన భార్యతో కలిసి పాల్గొంటున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా ఆయన… బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. అయితే దీప్తి సునయననే తనను కావాలని గెలికినట్లు చెప్పాడు. రెండో వారంలోనే తాను వెళ్లిపోతానని దీప్తి సునయన అన్న వీడియోను నాని గారు చూపించడం వల్లే తనని తాను నిరూపించుకున్నానని తెలిపాడు. తన కళ్లలో నిమ్మకాయ పిండే వీడియో బయటకు రాకపోతే కచ్చితంగా తాను రెండో వారంలోనే వెళ్లిపోయే వాడినని చెప్పాడు.
అలాగే చాలా మందిలా తాను అవకాశాల కోసం డైరక్టర్ల దగ్గరకు వెళ్లడం ఇష్టం ఉండదని వివరించాడు. తన కోపం, ముక్కుసూటి తనం వల్లే తనకు ఎక్కువగా అవకాశాలు రావట్లేదేమోనని కౌశల్ మండ చెప్తున్నారు. ఎవరేం అనుకున్నా, అం చేసినా మన క్యారెక్టర్ యే మన జీవితాలను నిలబెడుతుందని వివరించాడు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మండ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.