తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్స్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముగ్గురు నలుగురు మినహా ఎవరు కూడా ఆకట్టుకునే ఫేస్ లు లేవని ఒక్కరు కూడా మంచి స్టార్ డం ఉన్న వారు లేకపోవడం దారుణం అంటూ ప్రేక్షకులు ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో కొందరు కంటెస్టెంట్స్ వ్యవహరిస్తున్న తీరు మరియు వారు ప్రవర్తన చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ తర్వాత దర్శకుడు సూర్య కిరణ్ గురించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
సూర్య కిరణ్ గురించి ఇప్పటికే జనాలు మర్చి పోయారు. చాలా ఏళ్ల క్రితం ఆయన ‘సత్యం’ అనే సినిమాను తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు తీసినా కూడా వాటి పేర్లు చెబితే గుర్తు పట్టలేనంతగా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి దర్శకుడు ఏదో పైరవీతో బిగ్‌బాస్‌లోకి ఎంటర్ అయ్యి ఉంటాడు. ఏదో గమ్మున ఉండకుండా రచ్చ చేస్తున్నాడు. తానో పెద్ద స్టార్ డైరెక్టర్‌ను అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి చోట ఆయన స్టార్ డం చూపాలనుకోవడం బుద్ది తక్కువ పని అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వారంలో ఆయన ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యి ఉన్నాడు. కనుక ఆయన జాగ్రత్తగా ఉండాలని లేదంటే మొదటి వారంలోనే ప్రేక్షకులు అతడి తోక కట్ చేస్తారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శకుడిగా ఎప్పుడో ప్రాభవం కోల్పోయిన సూర్య కిరణ్ ఒక సామాన్య సెల్రబెటీగా అందులో ఉంటే పర్వాలేదు. లేదంటే మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తారు.
సూర్య కిరణ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ కళ్యాణి భర్త అనే విషయం తెల్సిందే. అలాగే వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న సుజీత కు అతడు అన్న అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఫేమ్ పలుకుబడి ఉన్న కారణంగా అతడు కొన్నాళ్లు ఉంటే బాగుంటుంది. లేదంటే మొదటి వారంలోనే ఎలిమినేట్ అయితే పరువు పోతుంది జాగ్రత్త.