
తెలుగు బిగ్‌బాస్ మూడు సీజన్‌లు కూడా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ షోలతో వచ్చిన టీఆర్పీ రేటింగ్ తో దుమ్ము రేపేలా లాభాలు వచ్చి ఉంటాయి. అందుకే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా బిగ్‌బాస్ సీజన్ 4ను మొదలు పెట్టారు. నిన్నటి షో తో మరోసారి బిగ్‌బాస్ రచ్చ చేయడం ఖాయం అనిపిస్తుంది. అయితే ఈసీజన్ లో కంటెస్టెంట్స్ విషయంలో కాస్త నిరుత్సాహం వ్యక్తం అవుతున్నా కూడా చివరకు గంగవ్వ ఎంట్రీ ఇవ్వడంతో అంతా ఆసక్తిగా షోను చూస్తున్నారు.
తెలుగు బిగ్‌బాస్ సీజన్ లలో ఎప్పుడు జరగని వింత గంగవ్వ ఎంట్రీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ నాల్గవ సీజన్ కోసం ప్రముఖులను బిగ్ బాస్ ప్రతినిధులు సంప్రదించగా పలువురు నో చెప్పినట్లుగా తెలుస్తోంది. బిగ్‌బాస్‌కు నో చెప్పిన వారిలో ప్రముఖంగా లవర్ బాయ్ తరుణ్, నందమూరి హీరోగా తారకరత్న, బిగ్‌బాస్ మొదటి సీజన్ విన్నర్ శివబాలాజీ భార్య మధుమిత, సురేఖ వాణి, హైపర్ ఆది, రఘు ప్రణవి దంపతులను జబర్దస్త కమెడియన్స్ మరో ఇద్దరిని కూడా బిగ్‌బాస్ వారు సంప్రదించారట.
కాని వేరు వేరు కారణాలు చెబుతూ బిగ్‌బాస్‌కు వారు నో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 లో ఈసారి కంటెస్టెంట్స్ గా ఉన్న వారు రెండు వారాల ముందు నుండే క్వారెంటైన్‌కు వెళ్లారు. అక్కడ నుండి నేరుగా బిగ్‌బాస్ హౌస్ కు వెళ్లారు. నాగార్జున హోస్ట్‌గా చేసిన మూడవ సీజన్ మంచి రేటింగ్ రావడంతో ఈసారి మరింత రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. అద్బుతమైన ఫామ్ లో నాగార్జున ఉన్నట్లుగా ఆయన మొదటి రోజు యాంకరింగ్ చూస్తుంటేనే అనిపిస్తుంది. చాలా విభిన్నంగా వృద్దుడి గెటప్ తో నాగార్జున డబుల్ రోల్ చేశాడు.
మొదటి సారి ఒక రియాల్టీ షోలో ఇలా జరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాగార్జున ఈ షో కోసం భారీ పారితోషికంను అందుకోబోతున్నాడు. ఇక షో లో ప్రతి ఒక్కరు కూడా ఈసారి తమ బెస్ట్ ఇచ్చేలా నిర్వాహకులు పూర్తి ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించారని తెలుస్తోంది. మరి వారు ఏం చేస్తారు, ఈసారి మిస్ అయిన వారు కుల్లుకునేలా ఎంటర్‌టైన్ మెంట్ ఉంటుందా అనేది చూడాలి.



