ఈ మధ్య తెలుగు సినిమాలకు బాలీవుడ్ లోనూ క్రేజ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా పుష్ప తర్వాత చాలా సినిమాలు హిందీలో విడుదల అవుతున్నాయి. మొన్నటికి మొన్న రవితేజ ఖిలాడీ సినిమాను కూడా హిందీలో విడుదల చేశారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్, రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాను బాలీవుడ్ లోనూ విడుదల చేయబోతున్నారు.
భీమ్లా నాయక్ సినిమాను చిత్ర బృందం తెలుగు, హిందీలో ఒకే రోజు విడుదల చేయాలనుకున్నప్పటికీ.. కుదరలేదు. అయితే అప్పటికే తెలుగులో చాలా సార్లు పోస్ట్ పోన్ చేయడంతో… రిలీజ్ చేసేశారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఆపేశారు. అయితే తాజాగా ఈ సినిమాను అక్కడ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు హీరో పవన్ కల్యాణ్, రానా లే కారణం. వారికి అక్కడి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వల్లే హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.
మార్చి 4వ తేదీన భీమ్లా నాయక్ సినిమాను హిందీలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే తెలుగులో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ఈ సినిమా అక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబడుతుందో తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.