
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా భీమలా నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న భీమ్లా నాయక్ రెండో రోజు కూడా వసూళ్ల మోత మోగించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందించిన ఈ సినిమాను సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేశారు.

మొదటి రోజు భారీ వసూళ్లు చేపట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే జోరు సాగించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మాసివ్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఏపీలో ఆంక్షలు, వివాదాలు నడుస్తున్నప్పటికీ భారీగానే వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38 కోట్ల గ్రాస్, 26 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3. 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
అయితే రెండో రోజు 20 కోట్లకు పైగా గ్రాస్, 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా రెండు రోజులకు భీమ్లా నాయక్ సినిమా 40 కోట్ల మార్క్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.