అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రం సోగ్గాడే చిన్నినాయన. 2015లో విడుదలైన ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ ప్రాజెక్టుకు సీక్వెల్ వస్తుందని గతంలోనే నాగ్ క్లారిటీ ఇచ్చాడు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబందించిన అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరి 16 నుంచి ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. కాగా అటు ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటించబోతుందట. ప్రస్తుతం ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ, అనుప్ రూబెస్తో కలిసి సాంగ్స్ కంపోజిషన్స్‌లో బిజీగా ఉన్నాడట.